Kangana Ranaut: మీ జీవితంలోని విలన్స్‌ను కామెడియన్లుగా మార్చుకొండి

6 Aug, 2022 12:28 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ వివాదానికి తెరలేపుతుంది. ఈ క్రమంలో ఆమె నెగిటివి, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో తనని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ గతంలో కంగనా ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిది. 

చదవండి: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్‌ అక్కడేనా?

ఈ సందర్భంగా మీ జీవితంలోని విలన్లను కామెడీయన్‌లుగా మార్చుకోండని సూచించింది. ‘వైఫల్యాలు, అవమానాలు, కించపరించిన సంఘటనలు వంటి అన్‌ఫెయిర్‌ థింగ్స్‌ను ఉపయోగించి ఎమోషనల్‌ డ్రామా ప్లే చేయడం నాకు నచ్చదు. మన కలలను నేరవేర్చుకునేందుకు అలాంటి అనుభవాలను ఇంధనంలా మార్చుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. మీ ఓటమిని చూసి ఆనందించే కళ్లలో మీమ్మల్ని చూసుకోకండి. కానీ వారి విమర్శలను నుంచి ఎదిగండి. అయితే మీ విజయంతో విమర్శకుల ముఖంపై కొట్టినట్టు చేయడం మాత్రం మరిచిపోకండి.

చదవండి: ‘లేడీ సూపర్‌స్టార్‌’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ

అప్పుడు మీ ముఖంపై, జీవితంలోకి వచ్చే నవ్వులే కదా అసలైన గెలుపు. అలా మీ జీవితంలోనే విలన్‌లను కమెడియన్‌లు మార్చేయండి. అప్పుడే నీ జీవితాన్ని నువ్వే మంచి కథగా రాసుకున్న డైరెక్టర్స్‌ అవుతారు’ అంటూ రాసుకొచ్చింది. కాగా మన జీవితంలోని నెగిటివిటి తీసేందుకు చెప్పిన మాటలు పలువురి ఆకట్టుకుంటున్నాయి. మంచి మాటలు చెప్పారంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తుంటే.. మరికొందరెమో ఎవరిని టార్గెట్‌ చేసి ఈ వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు