‘ఐటెమ్‌ సాంగ్‌ ఛాన్స్‌ రావాలంటే అలా చేయాలసిందే’

17 Sep, 2020 10:56 IST|Sakshi

ముంబై: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో బాలీవుడ్‌ ఆత్మహత్యలు, డ్రగ్స్‌ మాఫియా గురించి ప్రశ్నించగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్‌ సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ మండిపడ్డ సంగతి తెలిసిందే. అనంతరం కంగనా.. జయాబచ్చన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి ఆమెపై కంగనా ఘాటు వ్యాఖ్యాలు చేశారు. సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే అవకాశం రావాలన్నా, రెండు నిమిషాల సీన్‌లో నటించచాలన్నా కూడా వారు హీరోతో గడపాల్సి వుంటుందని అలాంటి వాళ్లకే రోల్స్ ఇస్తారని  ట్వీట్‌ చేశారు. తానే పరిశ్రమలో లేడి ఓరియంటెడ్‌ సినిమాలకు నాందీ వేశానని, దేశభక్తి సినిమాలతో మహిళ ప్రధాన సినిమాలు చేశానని పేర్కొన్నారు. జయాబచ్చన్‌, సినీ పరిశ్రమ ఆర్టిస్టులకు ఏం ఇచ్చాయి, రెండు నిమిషాల పాత్ర కోసం హీరోతో గడిపితేనే అవకాశాలు ఇవ్వడమా? అని ట్విట్టర్‌  వేదికగా కంగనా ప్రశ్నలు సంధించారు.

సిని పరిశ్రమకు చెందిన ఎంపీ రవి కిషన్‌ బాలీవుడ్‌ పరిశ్రమలో ఆత్మహత్యలు జరగకుండా చూడాలని పార్లమెంట్‌లో కోరిన విషయం విదితమే. అంతేకాకుండా డ్రగ్‌ మాఫియాకు సంబంధించి పూర్తిగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. చైనా, పాకిస్తాన్‌ నుంచి భారతదేశానికి డ్రగ్స్‌ వస్తుందని ఆయన ఆరోపించారు. ఇక దీనిపై స్పందించిన జయాబచ్చన్‌ రవికిషన్‌ పేరు ప్రస్తావించకుండానే సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులే పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ విమర్శించారు. దీంతో కంగనా జయ‌పై విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే.   చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్‌.. డ్రగ్స్‌...

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు