‘ఆస్కార్‌ నటితో మీకు పోలికా.. ప్లీజ్‌ బ్రేక్‌ తీసుకొండి’

13 Feb, 2021 18:02 IST|Sakshi

కంగనాను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజనులు

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కంగనా తనదైన రీతిలో స్పందిస్తారు. నచ్చనివారిని డైరెక్ట్‌గానే విమర్శిస్తారు. ట్రోల్స్‌ని అస్సలే పట్టించుకోరు. తాజాగా కంగనా తనని తాను హాలీవుడ్‌ స్టార్‌ నటి మెర్లీ స్ట్రీప్‌, ప్రముఖ ఇజ్రాయిల్‌ నటి గాల్ గాడోట్‌లతో పోల్చుకుంటూ.. వారి కంటే తానే ఎంతో మంచి నటని.. కావాలంటే తన కంటే గొప్ప నటిని భూమ్మీద మరొకరిని చూపించగలరా అంటూ ట్విట్టర్‌ వేదికగా సవాలు చేసిన సంగతి తెలిసిందే. 

దీనిపై నెటిజనులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. రకరకాల మీమ్స్‌ తయారు చేసి ఆమెను ట్రోల్ చేశారు. ‘‘అసలు మెరిల్‌ స్ట్రీప్‌తో నీకు పోలికేంటి.. ఆమె 3 సార్లు ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు.. 21 సార్లు ఆస్కార్‌ బరిలో నిలిచారు... మరి మీరు ఎన్ని ఆస్కార్‌లు సాధించారంటూ’’ ట్రోల్‌ చేశారు నెటిజనులు. ఈ విమర్శలపై కంగనా విరుచుకుపడ్డారు. ‘‘ఆస్కార్‌ అనేది కేవలం అమెరికన్‌ సినిమాలకు మాత్రమే ఇచ్చే అవార్డు. ఆ లెక్కన చూసుకుంటే.. మెరిల్‌ స్ట్రీప్‌ ఎన్ని జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాలు సాధించారు. ఇప్పటికైనా మారండి.. బానిస మనస్తత్వం నుంచి బయటపడి.. ఆత్మ గౌరవంతో మెలగండి’’ అని సూచిస్తూ ట్వీట్‌ చేశారు. 

అయితే కంగనా వాదన నెటజనులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ‘‘అసలు సెన్స్‌ ఉందా మీకు.. మీరు సోషల్‌ మీడియాలో హైపర్‌ యాక్టీవ్‌గా మారారు. మీ బుర్ర పనిచేయడం లేదనుకుంటాను. ప్లీజ్‌ మేడం.. కొద్ది రోజుల పాటు బ్రేక్‌ తీసుకుని సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి’’ అంటూ సూచిస్తున్నారు నెటిజనులు.

చదవండి: ఆమె డీఎన్‌ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ
               కంగనా ఇరవై అయిదు కోట్ల ఫైట్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు