ఎంతకాలం అదే పట్టుకుని ఏడుస్తావ్‌ హృతిక్‌: కంగనా

17 Dec, 2020 10:44 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌పై వ్యంగ్యస్త్రాలు వదిలారు. ఒకప్పుడు హృతిక్‌, కంగనాల మధ్య పెద్ద వివాదం చెలరెగిన విషయం తెలిసిందే. క్రిష్‌-3 సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని, ఆ తర్వాత విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కంగనా ఈ-మెయిల్‌ ఐడి నుంచి తనకు ముకుమ్ముడిగా మెయిల్స్‌ వస్తున్నాయని అవి చాలా ఇబ్బందిగా ఉన్నాయని ఆరోపిస్తూ సైబర్‌ సెల్‌కు 2016లో హృతిక్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో తన ఎఫ్‌ఐఆర్‌ను క్రైం బ్రాంచ్‌కు తరలించాల్సిందిగా హృతిక్‌ ఇటీవల సైబర్‌ సెల్‌ను కోరాడు. దీంతో తన ఎఫ్‌ఐఆర్‌ను క్రైం బ్రాంచ్‌ సీఐయూ(క్రైం ఇంటలీజెన్స్‌ బ్యూరో)కు తరలించారు. దీంతో కంగనా గురువారం సోషల్‌ మీడియా వేదికగా హృతిక్‌పై మాటల యుద్దానికి దిగారు. ‘హృతికి విచార గాధ మళ్లీ మొదలైంది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకుని, నాతో విడిపోయి చాలా ఏళ్లు గడిచిపోయాయి. కానీ అతడు తన జీవితంలో ముందుకు వెళ్లలేడాన్ని నిరాకరించాడు. మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. ధైర్యం కూడగట్టుకుని వ్యక్తిగత జీవితంపై ఆశతో ఇక నేను ముందుకుకేళ్తున్న సమయంలో హృతిక్‌ మళ్లీ పాత కథకు తెరలేపాడు. చిన్నపాటి ఎఫైర్‌ను పట్టుకుని ఇంకా ఎంతకాలం ఏడుస్తావ్‌’ అంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. (చదవండి: హృతిక్‌ ఇంటి విలువ ఎంతో తెలుసా!)

కాగా 2013-14 మధ్యకాలంలో కంగన రనౌత్‌ మెయిల్ ఐడీ నుంచి తనకు వందలాది మెయిల్స్ వచ్చాయంటూ హృతిక్‌ రోషన్‌ 2016లో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో హృతిక్‌ తరపు న్యాయవాది మహేష్‌ జెఠ్మలానీ ఇటీవల సైబర్‌ సెల్‌ లేఖ రాశారు. ‘2016 నుంచి ఇప్పటి వరకు ఈకేసులో ఎటువంటి పురోగతి లేదు. నటి కంగనా నుంచి వచ్చిన మెయిల్స్‌ కారణంగా అతడు, తన కుటుంబ సభ్యులు ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో పోలీసులకు ఆయన వివరించారు. అంతేకాదు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఉన్నత పోలీసు అధికారులను అతడు కోరారు. అయినప్పటికి ఈ కేసు విచారణ ముందుకు కదలలేదు. కావునా ఈ కేసును వెంటనే క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయాలి’ అని లేఖలో పేర్కొ‍న్నారు. ఈ మేరకు సైబర్‌ సెల్‌ హృతిక్‌ ఎఫ్‌ఐఆర్‌ను క్రైం బ్రాంచ్‌కు బదిలి చేసినట్లు ఇటీవల ప్రకటించింది. (చదవండి: దిల్జిత్‌.. కరణ్‌ పెంపుడు జంతువు: కంగన)

మరిన్ని వార్తలు