Kangana Ranaut: నేను మాత్రమే ధనవంతురాలిని.. మా అమ్మ కాదు: కంగనా

27 Feb, 2023 18:32 IST|Sakshi

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా స్టార్ డమ్ సొంతం చేసుకుందామె. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే పలు సినిమాల్లో నటించిన కంగనా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఉంటుంది కదా. వారి కుటుంబమంతా ముంబయిలో లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా. బాలీవుడ్ నటులు కోట్ల రూపాయల విల్లాలు కొనుగోలు చేయడం మనం వార్తల్లో వింటుంటాం. కంగనా కూడా అదే ఆ జాబితాలోకే వస్తుంది. కానీ ఇదంతా కంగనా వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే. కానీ ఆమె కుటుంబం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్ నటి. 

తన అమ్మ ఓ సాధారణ మహిళగా, పొలంలో పని చేస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన ట్విటర్‌లో షేర్ చేసింది కంగనా. ఇది చూసిన ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. మీరు ధనవంతురాలిగా ఉన్నప్పుడు.. ఇంత సింపుల్‌గా ఎలా ఉంటున్నారని అడిగాడు. దీనికి కంగనా స్పందించింది. అతని ట్వీట్‌కు కంగనా రనౌత్ సమాధామిచ్చారు. 

కంగనా మదర్ పొలంలో పనిచేస్తున్న ఫోటోను జతచేస్తూ.. 'దయచేసి గమనించండి. ఇక్కడ నేను మాత్రమే ధనవంతురాలిని.. నా తల్లి ధనవంతురాలు కాదు. నేను రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల కుటుంబం నుండి వచ్చా. మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్‌గా ఉంది. పొలంలో ప్రతి రోజు ఎనిమిది గంటలు పనిచేస్తుంది. సినిమా మాఫియాకు నా వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవాలి. నేను వారిలాగా పెళ్లిళ్లలో ఎందుకు చవక వస్తువులు ధరించను. అలాగే వారిలా పెళ్లిల్లలో డ్యాన్స్ చేయలేను.' అంటూ పోస్ట్ చేసింది. ఇది ఆమె అభిమానులు మీ అమ్మ అందరికీ ఆదర్శం అంటూ పోస్టులు పెడుతున్నారు. 

అంతే కాకుండా సినీ వర్గాల నుంచి తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. తన శత్రువులను ఉద్దేశించి భిఖారీ సినీ మాఫియా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చాలా మంది వ్యక్తులు తనను అహంకారి అని పిలిచారు. నేను ఇతర అమ్మాయిల లాగా కబుర్లు చెప్పను. పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయను. అలాగే హీరోల గదులకు వెళ్లను. కాబట్టి వారు నన్ను పేర్లు పెట్టి పిచ్చిదానిగా ముద్ర వేశారు. ఈ రోజు నా దగ్గర ఏమీ లేదు. కానీ మా అమ్మ పొలాల్లో పని చేయడం చూస్తే నాకు అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. కంగనా రనౌత్ ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ ఎమర్జెన్సీలో నటిస్తోంది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు