Kangana Ranaut: జాకీ చాన్‌ అలా చేశాడంటూ.. షారుక్‌ ఖాన్‌ని టార్గెట్‌ చేసిన ఫైర్‌ బ్రాండ్‌

11 Oct, 2021 08:15 IST|Sakshi

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఫైర్‌బ్రాండ్‌. ఆమె పేరుకు తగ్గట్టుగానే విడాకులు తీసుకున్న నాగచైతన్య-సమంత విషయంలో చైపై విరుచుకుపడింది. దీనికి కారణం అమీర్‌ఖాన్‌ అంటూ ఆరోపించింది. అనంతరం ముంబై డ్రగ్స్‌ కేసు విషయంలో షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కి మద్దతుగా నిలిచిన తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌ని విమర్శించింది. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షాను టా​ర్గెట్‌ చేసింది ఈ బ్యూటీ.

డ్రగ్స్‌ కేసు విషయమై బాలీవుడ్‌ ప్రముఖులు అందరూ ఆర్యన్‌కి సపోర్టుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అతని తండ్రి షారుక్‌ సైతం కొడుకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ కుమారుడి డ్రగ్స్‌ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టింది కంగనా. 

జాకీచాన్‌ కుమారుడు జైసీ చాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన జాకీ అది తన ఫెయిల్యూర్‌ అని అందరికి క్షమాణలు తెలిపాడు. కేసులో తన కొడుకును కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయనని నటడు చెప్పాడు. అంతేకాకుండా జైసీ ఆరునెలల శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మరోసారి అందరి సారీ చెప్పాడు ఈ యాక్షన్‌ హీరో.

ఆర్యన్‌ విషయంలో బాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి రియాక్ట్‌ అవుతూ ఈ పోస్టుని పెట్టింది కంగనా. దీంతో ఫైర్‌ బ్రాండ్‌ మరోసారి బాంబు పేల్చిందని అందరూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కాగా  ప్రస్తుతం ఆర్యన్ 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

చదవండి: ఆల్‌ మాఫియా పప్పంటూ.. హృతిక్‌కి కౌంటర్‌ ఇచ్చిన కంగనా రనౌత్‌

మరిన్ని వార్తలు