Major Movie Video Songs: ‘మేజర్‌’ నుంచి ఎమోషనల్‌ వీడియో సాంగ్‌, ఆకట్టుకుంటున్న అమ్మ పాట

21 Jun, 2022 16:51 IST|Sakshi

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. యంగ్‌ హీరో అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్‌ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

చదవండి: పూజాకు నిర్మాతలు షాక్‌, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!

మేజర్‌కు వస్తున్న విశేష స్పందనకు కానుకగా తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు.  ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది. 

మరిన్ని వార్తలు