కన్నడ నటుడు తనయునికి రోడ్డు ప్రమాదం, గాయాలు

2 Jul, 2021 10:53 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జైన బీఎండబ్ల్యూ కారు

చిక్కబళ్లాపురం: సినీ నటుడు జగ్గేశ్‌ కొడుకు యతిరాజ్‌ (29) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బాగేపల్లి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా గురువారం ఉదయం 11: 45 సమయంలో జాతీయ రహదారిపై అగలగుర్కి వద్ద సర్వీసు రోడ్డు నుంచి వచ్చిన బైకిస్టును తప్పించబోయి ఆయన బిఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

కారు నుజ్జునుజ్జు కాగా యతిరాజ్‌కు గాయాలు తగిలాయి. ఎస్పీ మిథున్‌కుమార్‌ విలేఖరులతో మాట్లాడుతూ యతిరాజ్‌కు చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి బెంగళూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బైకిస్టు సురక్షితంగా బయటపడ్డాడు.

చదవండి: అందరికంటే ఎక్కువగా ఏడిపించే వ్యక్తి నువ్వే, అందుకే: నటి

మరిన్ని వార్తలు