కన్నడ నటుడి సోదరి అదృశ్యం..

21 Jan, 2023 13:10 IST|Sakshi

బెంగళూరు: కన్నడ నటుడు, దర్శకుడు నవీన్‌కృష్ణ సోదరి నీతా పవర్‌ అదృశ్యమైంది. నాలుగు రోజుల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా నవీన్‌కృష్ణ సోషల్‌ మీడియాలో పోస్టు వేశారు. సోదరి ఫోటోను, సమాచారాన్ని కూడా పంచుకున్నారు.

నవీన్ కృష్ణ పోస్ట్ ప్రకారం.. సుబ్రమణ్యపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసించే నీతా పవార్ జనవరి 17 మధ్యాహ్నం 2:57 గంటలకు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేయాలని, తన సోదరి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పలు నెంబర్లు షేర్‌ చూస్తూ కోరారు. కాగా అదృశ్య ఘటనపై సుబ్రమణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అజిత్‌ సరసన సాయి పల్లవి! ఎంపిక చేశారా? లేక సస్పెన్స్‌గా ఉంచారా?

మరిన్ని వార్తలు