ప్రముఖ నటుడు సంచారి విజయ్‌ బ్రెయిన్‌ డెడ్‌

14 Jun, 2021 13:15 IST|Sakshi

జాతీయ అవార్డు గ్రహిత‌‌, ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్‌ కన్నుమూశారు. శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం(జూన్‌ 14) ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్‌ది బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ధృవీకరించారని, తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్‌ సోదరుడు సిద్దేశ్‌ వెల్లడించారు. కాగా విజయ్‌ మృతి వార్తతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.  స్టార్‌ హీరోలు సుదీప్‌, రాక్‌స్టార్‌ యశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. 

కాగా శనివారం (జూన్‌ 12) రాత్రి రేషన్‌ పంపిణి చేసేందుకు వెళ్లిన విజయ్‌ తన స్నిహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్‌ తీవ్రంగా గాయపడటంతో స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యలు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైందని, పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. కాగా విజయ్‌ 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో 2011లో వెండితెరపై అరంగేట్రం చేశారు. 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో స్టార్‌ హోదా పొందాడు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. తను చివరిసారిగా 'యాక్ట్‌ 1978' చిత్రంలో నటించారు.

చదవండి: 
రోడ్డుప్రమాదానికి గురైన నటుడు, పరిస్థితి విషమం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు