Upendra Health: కన్నడ స్టార్‌ ఉపేంద్రకు అస్వస్థత

24 Nov, 2022 18:13 IST|Sakshi

కన్నడ స్టార్‌ ఉపేంద్ర స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం ఆయన శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరగా చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యాడు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర నాలుగైదు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

డస్ట్‌ అలర్జీ ఉన్న ఉపేంద్ర యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్న క్రమంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాడు. అనంతరం తిరిగి సినిమా సెట్స్‌లో పాల్గొన్నాడు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందడంతో ఉపేంద్ర ఫేస్‌బుక్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్‌ స్పాట్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు.

చదవండి: ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌, హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌
ఓటీటీలో నవీన్‌చంద్ర రిలీజ్‌, ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ అంటే?

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు