పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన సంజన సిస్టర్‌ నిక్కీ గల్రానీ

16 Apr, 2021 11:49 IST|Sakshi

బెంగుళూరు : శాండిల్ వుడ్‌లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో హీరోయిన్‌ సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది. తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్‌మెన్‌పై చీటింగ్‌ కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఇందులో కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్‌ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని,ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. 

అగ్రిమెంట్‌ ప్రకారం.. ప్రతీ నెలా తనకు లక్ష రూపాయలు చెల్లించాలని, అయితే ఇప్పటివరకు పేమెంట్‌ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా నా ఫోన్‌కాల్స్‌కు సైతం సమాధానం ఇవ్వడం లేదని  పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్‌ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. కాగా 2014లో సినీ ఇం‍డసస్స్ర్టీలోకి అడుగుపెట్టిన నిక్కీ గల్రానీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. 

చదవండి : జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్‌
ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా!


 

మరిన్ని వార్తలు