Bigg Boss Promo: పండగ మొదలవుతోంది సార్.. ఆకట్టుకుంటోన్న ప్రోమో!

15 Sep, 2023 19:47 IST|Sakshi

తెలుగువారిని అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌ బాస్. ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటివారం కాస్తా నెమ్మదిగా సాగిన బిగ్‌బాస్ షో.. రెండోవారం నుంచే హాట్‌హాట్‌గా మారిపోయింది. అయితే తెలుగులో ఏడో సీజన్‌ కాగా.. కన్నడలో బిగ్ బాస్ సీజన్ 10కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.  త్వరలో ప్రారంభం కానున్నట్లు ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి  కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే సెప్టెంబర్‌ 2వ తేదీన సుదీప్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో  కిచ్చా కనిపించలేదు. దీంతో మరోసారి  స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే బిగ్‌బాస్‌ శాండల్‌వుడ్‌ అభిమానులకు సందడి చేయనుంది. 

(ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్‌ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం! )

సరికొత్తగా ప్రోమో

బిగ్ బాస్ ప్రతి సీజన్‌కు విడుదల చేసే ప్రోమోలు కాస్తా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు  ప్రత్యేకంగా రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోను రిలీజ్ చేశారు. సరికొత్త "ఏంటి సార్ కొత్త ఫోన్" అని ఓ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్‌ను అడిగాడు యువకుడు. అవును సార్ నా కొడుకు పండగకి కొనిచ్చాడు. అని చెప్పగానే ప్రోమోలో సుదీప్ కనిపించాడు. 

ఆ తర్వాత అదే యువకుడు ఆటో ఎక్కి ఇంటికి వెళ్తే.. పండగ మొదలవుతోంది సార్ అంటూ ఆటోడ్రైవర్ నుంచి సమాధానం వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీధి అంతా పండుగలా కనిపిస్తుంది. ఏంటిరా ఇందతా సందడి అని అక్కడి యువకులను అడుగుతాడు. వారంతా ఇది వందరోజుల పండగ అని సమాధానమిస్తారు.' ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 లుక్  చూపించారు. సుదీప్ కనుసైగ చేస్తూ "హ్యాపీ బిగ్ బాస్" త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది అంటూ సుదీప్ ఫోటోను ఆవిష్కరిస్తూ సందడి చేస్తూ కనిపించారు ఫ్యాన్స్. 

కంటెస్టెంట్స్ ఎవరు? 

అయితే ఈ సీజన్‌లో బిగ్ బాస్ లిస్ట్ లో పది మందికి పైగా పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియరాలేదు. త్వరలోనే ఈ షో ప్రారంభమైన తర్వాతే ఆ క్యూరియాసిటీకి బ్రేక్ పడనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి)

మరిన్ని వార్తలు