పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌పై భార్య ఫిర్యాదు!

28 Jan, 2024 14:33 IST|Sakshi

కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్సోరాయ్‌కు గుర్తింపు ఉంది. కన్నడలో తనదైన శైలిలో సినిమాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మన్సోర్‌పై ఆయన సతీమణి అఖిల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త మానసిక, శారీరక హింసతో పాటు అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడని బెంగుళూరులోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో  ఆమె ఫిర్యాదు చేసింది.

అఖిల ఫిర్యాదులో ఏముంది
మన్సోర్ భార్య అఖిల సుబ్రహ్మణ్యపూర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె భర్త మన్సోర్ (మంజునాథ్ ఎస్) కోవిడ్ సమయంలో సినిమా నిర్మించినందుకు అతని కుటుంబం నుంచి  రూ. 10 లక్షల రూపాయలు అందుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. అదేవిధంగా రూ.30 లక్షల ఎస్‌యూవీ కారు ఇవ్వాలని మన్సోర్ తల్లి వెంకటలక్ష్మమ్మ, సోదరి హేమలత వేధిస్తున్నారని అఖిల తెలిపింది. ప్రస్తుతం కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది: మన్సోర్‌ 
తన భార్య అఖిల మానసిక సమస్యలతో బాధపడుతోందని డైరెక్టర్‌ మన్సోర్ కూడా పోలీసులకు లేఖ ద్వారా ఇలా తెలిపాడు. 'నేను ప్రస్తుతం నా జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దానికి కారణం నా భార్య అఖిల మానసిక సమస్యలే.. నేను దీని గురించి చాలారోజుల నుంచి ఆందోళన చెందుతున్నాను. ఆమెకు చికిత్స అందించేందుకు బెంగళూరులోని ఒక కౌన్సెలింగ్ కేంద్రానికి కూడా తీసుకెళ్లాను.

అయినా ఆమెలో ఎలాంటి మార్పులు రాలేదు. అంతేకాకుండా ఆమెకు థెరపీ అవసరమని వైద్యులు చెప్పారు. ఆపై ఆమెకు కంటిన్యూగా కౌన్సెలింగ్ చేస్తూనే చికిత్స ప్రారంభించాలి. పెళ్లి సమయంలో గానీ, పెళ్లి తర్వాత గానీ నేను అఖిల కుటుంబం నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదు. ఆమె కుటుంబం నుంచి నాకు ఎలాంటి డబ్బు, నగలు, వాహనం అందలేదు. ఈ విషయంలో నా బ్యాంక్‌ ఖాతాను కూడా ఎవరైనా చెక్‌ చేయవచ్చు.' అని  పోలీసులకు మన్సోర్‌ చెప్పాడు.

జాతీయ అవార్డు కూడా తీసుకుపోయింది
అఖిల మాతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలతో పాటు నాకు వచ్చిన జాతీయ అవార్డు, ఇతర పతకాలు కూడా ఎత్తుకెళ్లింది. ఫిర్యాదు చేయడానికి ముందు నా భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. దానికి సంబంధించిన వీడియో, నాపై, మా అమ్మపై జరిగిన దుర్భాషల వీడియో నా వద్ద ఉన్నాయి. వాటిని పిటిషన్‌తో పాటు సాక్ష్యంగా ఇస్తున్నాను.' అని ఆయన పేర్కొన్నాడు.

 తన భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపులు, దళిత యువతిపై హింస వంటి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవద్దని అభ్యర్థించాడు. 2021లో అఖిలను మన్సోర్‌ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజుల నుంచి వారి వైవాహిక జీవితంలో గొడవలు రావడం జరిగింది. ప్రస్తుతం అఖిల ఫిర్యాదు విషయంలో ఫైనల్‌గా ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు