ఓ ప్రత్యేక ఈవెంట్‌లో పునీత్‌ రాజ్‌ కుమార్‌ వేడుకలు.. ఎప్పుడంటే..?

14 Nov, 2021 17:02 IST|Sakshi

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ వేడుకలను ఒక ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించబోతున్నారు. కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు దివంగత నటుడి వేడుకలను నవంబర్‌ 16న జరపనున్నారు. ఈ రోజంతా కన‍్నడ చిత్ర పరిశ్రమ రోజంతా మూసివేస్తారు. 3 గంటలపాటు జరిగే ఈ ఈవెంట్‌లో ఎవరెవరూ హాజరవుతాలో చూడాలి. 

కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ)తో పాటు శాండల్‌ వుడ్‌ ఫిల్మ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలు 'పునీత్‌ నామన' పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. అయితే కొవిడ్‌ కారణంగా అతిథుల జాబితాలో పరిమితులు ఉండనున్నట్లు సమాచారం. నిర్వాహకులు పొరుగు రాష్ట్రాలు, వారి చిత్ర పరిశ్రమ, ఛాంబర్ల నుంచి సభ్యులను కూడా ఆహ్వానించారు. పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి 1500 మంది హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.
 

ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కన్నడ సినీ పరిశ్రమ సభ్యులు పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి నాగేంద్ర ప్రసాద్ రచించగా, గురుకిరణ్ స్వరపరచిన ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు.
 

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మరణించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30,000 మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు