సీనియర్‌ నటి భర్త, ప్రముఖ నిర్మాత మృతి

27 Apr, 2021 08:25 IST|Sakshi

బెంగుళూరు: కన్నడ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము(52) కన్నుమూశారు. గత వారం ఆయనకు కరోనా సోకగా బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సోమవారం (ఏప్రిల్‌​26) సాయంత్రం తుది శ్వాస విడిచారు. కొణిగల్‌ రాము కన్నడ సినీ ఇండస్ర్టీలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తీశారు. 1990ల కాలంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె.


కొణిగల్‌ రాము ఏ సినిమా తీసినా బడ్జెట్‌ మాత్రం కోట్లల్లో ఉండేది. అందుకే కన్నడ నాట ఆయన్ను కోటి రాము అని పిలుస్తారు. శాండల్‌ వుడ్‌లో ఏకే 47, లాకప్‌ డెత్‌, సీబీఐ దుర్గ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ప్రొడ్యూస్‌ చేశారు. కొణిగల్‌ రాము మృతిపై కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు