Pushparaj Trailer Launch: ఆకట్టుకుంటున్న అర్జున్‌ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా ‘పుష్పరాజ్‌’ ట్రైలర్‌

8 Aug, 2022 17:52 IST|Sakshi

కన్నడ హీరో ధ్రువ సర్జా, రచిత రామ్‌, హరిప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పరాజ్‌ ది సోల్జర్‌’. ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 27న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం నేడు ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌లో చేతులు మీదుగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేయించింది.

చదవండి: క్రేజీ ఆఫర్‌.. మహేశ్‌-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు?

ఇక ట్రైలర్‌ లాంచ్‌ చేసిన అనంతరం ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పుష్పరాజ్’ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది.హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు’ అని అన్నారు. ఇక టైలర్‌ చాలా చూశానని, చాలా బాగుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు ఆయన ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు