Rishab Shetty: వాటికి ప్రేక్షకులే సమాధానమిస్తారు: కాంతార హీరో రిషబ్‌ శెట్టి

31 Oct, 2022 16:11 IST|Sakshi

రిషబ్‌ శెట్టి  హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రాన్ని తెలుగులో  అక్టోబర్ 15న విడుదల చేశారు. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ముంబయి చేరుకున్న రిషబ్‌ శెట్టి సినిమాకు సంబంధించిన పలు విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే కాంతారపై వస్తున్న పలు విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. 

(చదవండి: ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి)

రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ..'వాటిపై ఎలాంటి కామెంట్స్‌ చేయాలనుకోవడం లేదు. అందరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. వంద శాతం మా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ  సినిమా ఎంతలా ప్రజాదరణ సొంతం చేసుకుందన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి నెగెటివ్‌ కామెంట్స్‌కు ప్రేక్షకులే సమాధానమిస్తారు.'అని అన్నారు.

హిందీలో కాంతార రీమేక్..: కాంతార మూవీని హిందీలో రీమేక్‌ చేస్తే ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుందని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి రిషబ్‌ బదులిస్తూ..'కాంతార’ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన సినిమా. ఈ చిత్రంలో పాత్రను పోషించాలంటే అక్కడి ప్రజల సంస్కృతిని అర్థం చేసుకోవాలి. బాలీవుడ్‌లో చాలామంది స్టార్‌ హీరోలంటే నాకు ఇష్టం. రీమేక్‌లపై నాకు పెద్దగా ఆసక్తి లేదు' అని సమాధానమిచ్చారు. బాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ చిత్రం వసూళ్లతో దూసుకెళ్తోంది.

మరిన్ని వార్తలు