Rishab Shetty: సినిమా చూసేందుకు డబ్బుల్లేక కూలీ పనులకు వెళ్లా: రిషబ్ శెట్టి

6 Nov, 2022 17:03 IST|Sakshi

రిషబ్ శెట్టి ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరు వినిపిస్తోంది. కాంతార మూవీలో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్‌ టాక్‌తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. కాంతార అద్భుతమైన విజయంలో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కానీ.. రిషబ్ బ్యాక్‌ గ్రౌండ్ ఏంటి? అసలు సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు?  అనే విషయాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను రిషబ్ వెల్లడించారు.

(చదవండి: సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్)

సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు చేసినట్లు రిషబ్ శెట్టి తెలిపారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని వెల్లడించారు.రిషబ్ శెట్టి నటుడిగా తన ప్రారంభ దశను గుర్తుచేసుకున్నాడు. మొదట క్లాప్ బాయ్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‍గా పనిచేశానని చెప్పారు.

 రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్‌పై షార్ట్‌టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు. 

(చదవండి: విశ్వక్‌ సేన్‌- అర్జున్‌ వివాదం..యంగ్‌ హీరోపై చర్యలు తప్పవా?)

కూలీ పనులకు వెళ్లేవాన్ని: రిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశానని వెల్లడించారు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడినని చెప్పారు.  2004 నుంచి 2014లో నా మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్‌లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో పనిచేసినట్లు వెల్లడించారు.

సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణం: చదువుకునే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ  హిట్‌గా నిలిచింది. 

మరిన్ని వార్తలు