Kantara Movie OTT Release: ఓటీటీకి 'కాంతార'..అదే ప్రధాన కారణమా?

22 Nov, 2022 18:04 IST|Sakshi

బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులైనా థియేటర్లలో క్రేజ్‌ ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈ చిత్రం ఓటీటీలోకి రావడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవలే నవంబరు 24న ఆమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో వచ్చేస్తుందంటూ సోషల్‌మీడియాలో వార్తలొచ్చాయి. 

(చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేస్తోన్న కాంతార, అంతలోనే ట్విస్ట్‌!)

కానీ ఈ విషయంపై అధికారిక ఒక్క ప్రకటన కూడా చిత్రబృందం ఎక్కడా ఇవ్వలేదు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌ కూడా దీనిపై ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంతార మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం ఓటీటీ విడుదలపై హోంబాలే ఫిల్మ్స్‌ కార్తిక్‌ గౌడను నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.
కారణం అదేనా?: కాంతార మూవీ క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట, రిషబ్‌శెట్టి నటన లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్‌ 'తెయ్యికుడుం బ్రిడ్జ్‌' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్‌లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్‌ తొలగించింది. ఈ వివాదం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. మరోవైపు ‘తెయ్యికుడుం బ్రిడ్జ్’ బృంద సభ్యులు గతవారం బెంగళూరులో ‘నవరసం’ అనే పాటను ప్రదర్శించారు.

(చదవండి: కాంతార హీరోకు గోల్డెన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రజనీకాంత్‌!)

కేజీఎఫ్‌ను దాటేసిన కలెక్షన్లు..: కన్నడ హీరో రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార.సెప్టెంబర్‌ 30న  చిన్న సినిమాగా రిలీజై భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ టాలీవుడ్‌లో అక్టోబర్‌ 15న రిలీజ్‌ చేశారు. తెలుగులోనూ అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కర్ణాటకలో ‘కేజీయఫ్‌2’ రికార్డు రూ.155 కోట్లను అధిగమించి రూ.160.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

మరిన్ని వార్తలు