Kantara Movie: మరో భాషలో సిద్ధమైన ‘కాంతార’.. రిలీజ్ ఎప్పుడంటే?

25 Nov, 2022 15:22 IST|Sakshi

కేవలం మౌత్‌టాక్‌తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సినిమా 'కాంతార'. ప్రస్తుతం ఈ చిత్రం ఆమెజాన్‌ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచిన వరాహరూపం పాటను తొలగించడంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. అయితే దాదాపు భాషతో సంబంధం లేకుండా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తాజాగా మరో భాషలో రిలీజ్ కానుంది.

(చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్‌ ట్విస్ట్‌.. బాలేదని ట్వీట్స్‌ చేస్తున్న నెటిజన్లు)

కర్ణాటకలోని తులునాడు సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంలో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన తులు భాషలో అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 2 నుంచి ఈ సినిమా తులు భాషలో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది.  ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిశోర్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మరో పాత్రలో కనిపించిన షానిల్‌ గురు తులు వర్షన్‌ డబ్బింగ్‌ పనులను పర్యవేక్షిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు