Kantara OTT : ఓటీటీలోకి కాంతార.. అది మిస్సయ్యిందని ప్రేక్షకులు నిరాశ

24 Nov, 2022 13:41 IST|Sakshi

కన్నడ సెన్సేషన్‌ 'కాంతర' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేజీఎఫ్‌ను బీట్‌ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంతార సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. అయితే కాంతార ఓటీటో రిలీజ్‌లో అభిమానులకు మేకర్స్‌ షాక్‌ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్‌ అయినటువంటి వరహారూపం సాంగ్‌ని మార్చేయడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ‘వరాహరూపం’ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అలాంటిది ఓటీటీకి వచ్చేసిరికి ట్యూన్‌ మార్చి కొత్త మ్యూజిక్‌తో విడుదల చేశారు.  ఒరిజినల్‌ సాంగ్‌తో పోలిస్తే ఇది బాలేదని, వరహారూపం ఒరిజినల్‌ వెర్షన్‌ని అప్‌డేట్‌ చేయండి అంటూ రిషబ్‌ శెట్టి సహా మూవీ టీంకు  నెటిజన్లు రిక్వెస్టులు పెడుతున్నారు.

కాగా తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని  మలయాళ బ్యాండ్‌ 'తెయ్యికుడుం బ్రిడ్జ్‌'ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్‌లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్‌ తొలగించింది. మరి ఈ విషయంలో కాంతార మేకర్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. 

>
మరిన్ని వార్తలు