కపటనాటక సూత్రధారి పోస్టర్‌: కొత్తగా ఉంది కదూ!

14 Apr, 2021 15:43 IST|Sakshi

రచయిత కోన వెంకట్ రిలీజ్ చేసిన 'కపటనాటక సూత్రధారి' ఫస్ట్ లుక్

భిన్నమైన కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ప్రముఖ రచయిత కోన వెంకట్ రిలీజ్ చేశారు. అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. "ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఉంది.. చూస్తుంటే ఎంతో డిఫరెంట్‌ సినిమా అని తెలుస్తుంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమా చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది.. సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అందరికి అల్ ది బెస్ట్" అన్నారు.

ఈ సినిమాలో విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైనా దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్‌లు సహనిర్మాతలు వ్యవహరిస్తున్నారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చదవండి: ఎన్టీఆర్‌ ఎఫెక్ట్‌.. బన్నీ సినిమా ఆగిపోయిందా?

బాలీవుడ్‌ హాట్‌ఫేవరెట్ కియారా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు