పెళ్లి పీటలెక్కిన 'ద కపిల్‌ శర్మ షో' కమెడియన్లు

27 Apr, 2021 14:17 IST|Sakshi

"ద కపిల్‌ శర్మ షో"తో గుర్తింపు పొందిని హాస్య నటి సుగంధ మిశ్రా ప్రియుడు, కమెడియన్‌ సంకేత్ భోస్లేని పెళ్లాడింది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పంజాబ్‌లోని లూధియానాలో వీరి పెళ్లి జరిగింది. వివాహానికి హాజరైన వారందరికీ ముందే కరోనా పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరూ  ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమని తేల్చుతూ ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు.

ఇక​ వధువు సుగంధ మిశ్రా పింక్‌ లెహంగాలో అందంగా ముస్తాబవగా, సంకేత్ భోస్లే వైట్‌ అండ్‌ ఎల్లో కుర్తాలో కనిపించారు. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


ఇక వారం రోజుల క్రితమే సంకేత్ భోస్లేతో కలిసి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ సుగంధ మిశ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సంకేత్‌ భోస్లేతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ.. డిసెంబర్‌ నుంచే పెళ్లిపనులు మొదలుపెట్టానని, ఆన్‌లైన్‌లో పెళ్లి షాపింగ్‌ కూడా పూర్తైంది అని తెలిపింది. సంకేత్‌ డాక్టర్‌ కావడంతో కోవిడ్‌ నిబంధనల మధ్య అతి తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం, పెళ్లి ఒకేసారి జరుగుతాయని అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 

A post shared by Preeti Simoes (@preeti_simoes)

చదవండి : మా డేటింగ్‌ను సీక్రెట్‌గా ఉంచాను, తప్పలేదు: నటి
గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు