కపిల్‌ శర్మకు రూ. 5.5 కోట్ల కుచ్చుటోపి!

7 Jan, 2021 17:37 IST|Sakshi

ముంబై: ప్రముఖ కమెడి కింగ్‌ కపిల్ శర్మకు ముంబై క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ గురువారం సమన్లు ఇచ్చింది. ఇటీవల ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ రిజిస్టర్డ్ కార్ల కేసులో ఆయన స్టెట్‌మెంట్‌ కోసం ఏపీఐ సచిన్‌ వాజ్ ఆయనను పలిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కపిల్‌ శర్మ ఈరోజు మధ్యాహ్నం ముంబ్రై క్రైం బ్రాంచ్‌ కార్యాలయంలో హజరయ్యారు. ఆనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వానిటీ వ్యాన్‌ కారు తయారి కోసం ఇటీవల కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రియాకు 5.5 కోట్ల రూపాయలను చెల్లించాను. అయితే అతడు డబ్బులు తీసుకుని నా పని చేయకుండ తప్పించుకుని తిరుగుతున్నాడు. (చదవండి: ఆ సమయంలో చనిపోవాలనుకున్న: హీరో రాజా

దీంతో నేను ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు గతేడాది ఫిర్యాదు చేశాను. చాబ్రియాపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు పేపర్‌లో చదివాను. దీంతోనే ముంబై కమిషనర్‌ను కలవాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే నా వాంగ్ములం తీసుకునేందుకు పోలీసులు పిలిచారు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా డిసెంబర్‌ 9న చాబ్రియాను అరెస్టు చేసిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 420, 465, 467, 468, 471, 120(బీ) చట్టం కింద కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు