బాహుబలిలో గుర్రం శబ్దాలు సృష్టించింది ఎవరో తెలుసా?

7 Jan, 2023 09:13 IST|Sakshi

సినిమా అంటే సాధారణంగా అందరి దృష్టి హీరో, హీరోయిన్లపైనే ఉంటుంది. ఆ తర్వాత స్థానం డైరెక్టర్, మ్యూజిక్ ఎవరనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మీకెవరికీ కనిపించకుండా బ్యాక్‌ గ్రౌండ్‌లో కష్టపడేవారి గురించి మీకు తెలుసా? కనీసం వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి అరుదైన వారి గురించిప్రత్యేక కథనం. 

మీరెప్పుడైనా సౌండ్ లేకుండా సినిమా చూశారా? బాహుబలి లాంటి సినిమాలో గుర్రపు స్వారీ శబ్దాలు లేకుండా చూడగలరా? మరీ దీనికంతటికీ కారణం ఎవరు? అసలు ఆ శబ్దాలు సృష్టించేది ఎవరో మీకు తెలుసా? ఈ పనిని ఎలా నిర్వర్తిస్తారో తెలుసా? దీని వెనుక చరిత్ర ఏంటీ? అసలు ఈ పనిని ఎవరు చేస్తారు? వారు ఎలా చేస్తారో తెలుసుకుందాం.

సినిమాలోని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే శబ్దాలు చేసే వారిని ఫోలీ ఆర్టిస్ట్ అంటారు. వీరు సినిమాలోని సందర్భాన్ని బట్టి శబ్దాలు సృష్టించడం వీరి పని. ఎంత పెద్ద సినిమా అయినా వీరు చేసే శబ్దాలు లేకుండా చూడడం చాలా అరుదు. ఈ ఫోలియో ఆర్ట్ అంటే మన రోజు వారి జీవితంలో ఉపయోగించే వస్తువులతో సౌండ్ ఎఫెక్ట్స్‌ అందించండం. ఈ పనులన్నీ ప్రీ ప్రొడక్షన్‌ సమయంలో చేస్తారు. 

కరణ్ అర్జున్ సింగ్  
సినీ పరిశ్రమలోని ఫోలీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించారు కరణ్ అర్జున్ సింగ్. ఆయన  చిన్న వయసులోనే ఫేమస్ అయ్యారు. ఆయన పలు రకాల భాషా చిత్రాలకు ఫోలీ పేరుతో సౌండ్ ఆర్ట్‌ను రూపొందిస్తున్నారు. బాహుబలి సినిమాతో సహా పలు ప్రముఖ చిత్రాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ఆయన ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. 

అర్జున్ సింగ్ మాట్లాడుతూ..' ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎక్కడ లేరు. కేవలం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సిందే.  ఫోలీ ఆర్టిస్ట్‌కు సౌండ్ ప్రధానం. ఇప్పటివరకు దీనిపై శిక్షణ ఇచ్చే సంస్థ లేదు. మంచి ఫోలీ ఆర్టిస్ట్ కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది.' అని అన్నారు. 

కరణ్ అర్జున్ సింగ్ ఎవరు?
కరణ్ అర్జున్ సింగ్ ఒక ప్రముఖ ఫోలీ ఆర్టిస్ట్. 35 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ (ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ)తో సహా పలు చిత్రాలకు పని చేస్తున్నారు. ఆయన దాదాపు 3000 కంటే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. అతను ముంబైలో అత్యంత ప్రతిభావంతులైన ఫోలీ కళాకారులు, సౌండ్ ఇంజనీర్లు, సౌండ్ ఎడిటర్లు, సౌండ్ డిజైనర్లతో జస్ట్ ఫోలీ ఆర్ట్ అనే పేరుతో సౌండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు