రవిశంకర్‌ బయోపిక్‌: 100 దేశాలు.. 21 భాషలు

14 May, 2021 03:53 IST|Sakshi

బాలీవుడ్‌లో బయోపిక్‌లకు కొదవలేదు. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. క్రికెటర్‌ మిథాలీ రాజ్, చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్, ఆధ్యాత్మిక వేత్త ఓషో వంటి వారి బయోపిక్‌లు కూడా రానున్నాయి. తాజాగా గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ జీవితం వెండితెరపైకి రానుంది.

గురువారం (మే 13) రవిశంకర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ బయోపిక్‌ను ప్రకటించారు ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌. ఈ చిత్రానికి ‘ఫ్రీ (స్వేచ్ఛ అని అర్థం కావొచ్చు): ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌’ అని టైటిల్‌ పెట్టారు. ‘‘గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ జీవితం ఆధారంగా తీయనున్న ఈ సినిమా ద్వారా పాజిటివ్‌నెస్‌ని పెంపొందించాలన్నదే మా ఆలోచన. ఈ చిత్రానికి మాంటో బస్సి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 21 భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో రిలీజ్‌ చేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు కరణ్‌ జోహార్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు