Karan Johar: వాతావరణ మార్పుపై పోరాటంగా 'నయా భారత్‌ కా సప్నా'

2 Aug, 2022 21:22 IST|Sakshi

Karan Johar Launches Naye Bharat Ka Sapna Campaign: 'నయా భారత్ కా సప్నా' పేరిట స్వాతంత్ర్య దినోత్సవ  ప్రచారాన్ని బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ ప్రారంభించారు. 'కూ యాప్' ద్వారా వాతావరణ మార్పులపై పోరాటం చేద్దామనే తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కరణ్ జోహార్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నయా భారత్ కా స్వప్నా అనే కార్యక్రమం సరికొత్త భారతదేశం కోసం సమిష్టి మార్పును తీసుకురావడానికి ఒక తీర్మానాన్ని  ఆమోదించేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది.

భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచడం, పునర్వినియోగం, తగ్గించడం, రీసైకిల్ చేయడం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడతామని  ప్రతిజ్ఞ చేస్తూ కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా స్వతంత్ర భారతదేశపు 75 వ వార్షికోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవడానికి వినియోగదారులను సన్నద్ధం చేస్తోంది.

ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలకు, కోవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. 'కూ యాప్ ప్రగతిశీల మార్పులు అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపిస్తోందని' ఆ యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ వెల్లడించారు. అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ, “ఈ వాతావరణ మార్పుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఈ నయా భారత్ కా సప్నా లో పాల్గొని, కూ యాప్‌ ద్వారా బహుభాషా వినియోగదారులతో సంభాషిస్తూ సమస్య గురించి అవగాహన కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ స్వాతంత్య్ర సంబురాల సమయంలో మనమందరం చేయి చేయి కలుపుదాం. మన భూమి, మన దేశం, మన ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు