మా అభిమాన భార్య కరణ్‌ జోహార్‌యే..!

30 Nov, 2020 17:53 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రోడక్షన్‌లో నిర్మించిన ‘ది ఫ్యాబులస్‌ లైఫ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ సిరీస్‌ గత శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ రియాలిటీ షోలో ప్రముఖ బాలీవుడ్‌ నటుల భార్యలు కథానాయికలకు నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ విడుదలైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఎదుర్కొంటొంది. ఇందులో సోహై ఖాన్‌(సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు) భార్య సీమా ఖాన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రసారమైన నాలుగవ ఎపీసోడ్‌లో సీమా-సోహైల్‌ ఖాన్‌లను నెటిజన్‌లు ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షో నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. అది చూసిన కరణ్‌ తనదైన శైలీలో ట్రోలర్‌కు సమాధానం ఇచ్చాడు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!)

అయితే ఈ వెబ్‌ సిరీస్‌పై డాక్టర్‌ అఖిలేష్‌ గాంధీ అనే ట్విటర్‌ యూజర్‌ కరణ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఫ్యాబులస్‌ లైప్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌లో మన అభిమాన భార్య కరణ్‌ జోహార్‌ అని మనమంతా అంగీకరించక తప్పదని నా అభిప్రాయం’ అంటూ కామెంట్‌ చేశాడు. అది  చూసిన కరణ్‌ సదరు నెటిజన్‌ కామెంట్‌పై స్పందిస్తూ.. ‘ఓకె నీ ట్వీట్‌ నిజంగా నన్ను నవ్వించింది. ఈ ట్రోల్‌ నన్ను రీఫ్రెష్‌ చేసింది. ధన్యవాదలు మిస్టర్‌ డాక్టర్‌’ అంటూ కరణ్‌ చురకలు అట్టించారు. కాగా కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాలు కలిసి ‘ది ఫ్యాబులస్‌ లైఫ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ రియాలిటీ షోను రూపొందించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటులు సోహైల్‌ ఖాన్‌ భార్య నీలం ఖాన్‌, సంజయ్‌ కపూర్‌ భార్య మహీప్‌ కపూర్‌, చుంకీ పాండే భార్య భావన పాండే, సమీర్‌ సోనీ భార్య నీలం కొఠారీలు నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు