11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు

24 May, 2022 14:10 IST|Sakshi

Karan Mehra Accuses Wife Nisha Rawal Have Extramarital Affair: టీవీ నటి నిషా రావల్‌, నటుడు కరణ్‌ మెహ్రా విడిపోయి ఒక సవంత్సరం అవుతుంది. వీరి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. గృహ హింస కేసు కింద నిషా ఫిర్యాదు చేయడంతో కరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. అయితే జూన్‌ 1న బెయిల్‌పై విడుదలైన కరణ్‌.. నిషాపై పలు ఆరోపణలు చేశాడు. తనను తానే హింసించుకుని అతడిపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నాడు. భారీగా భరణం పొందేందుకే ఇలా చేస్తోందని పేర్కొన్నాడు. నిషా వివాహేతర సంబంధం పెట్టకుందని మీడియా ఎదుట ఆరోపించాడు. అంతేకాకుండా నిషా తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

'ఇప్పటికీ నా ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. గత 11 నెలలుగా ఆ వ్యక్తి నా ఇంట్లో నా భార్యతో (నిషాతో) ఉంటున్నాడు. అతను తన భార్యాపిల్లలను విడిచి పెట్టి నా భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అంతేకాకుండా నా ఆస్తులు, కార్లు, వ్యాపారాలు లాక్కున్నారు. నిషాకు సన్నిహితులైన రోహిత్ వర్మ, మునీషా ఖట్వా ఇప్పుడు తనతో ఎందుకు లేరు.' అని కరణ్‌ మెహ్రా మీడియాతో తెలిపాడు. 

చదవండి: 👇
అతడిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన సీరియల్‌ నటి

ఇదిలా ఉంటే గతేడాది కరణ్ ఆరోపణలపై నిషా స్పందిస్తూ 'నాకు ఎలాంటి భరణం అక్కర్లేదు. నాతో కలిసి సంపాదించుకుంది నాకే ఎలా తిరిగి ఇస్తాడు. మేము కలిసి ప్రతిదీ నిర్మించాం. నేను నా చిన్నవయసు నుంచే సంపాదించడం ప్రారంభించాను. యే రిష్తా సీరియల్‌లో భాగం కాకముందు నుంచే నేను అతనికి సపోర్ట్‌గా నిలిచాను. నేను చాలా పని చేశాను. నేను ఎవరితో కలిసి పనిచేసిన కూడా వాణిజ్య ప్రకటనలకు కరణ్‌ బాధ్యత వహిస్తాడని హామీ ఇస్తున్నాను.' అని పేర్కొంది.  

చదవండి: 👇
నా భార్యే తలను గోడకేసి కొట్టుకుంది: టీవీ నటుడు

మరిన్ని వార్తలు