ఐటం సాంగ్‌లో దైవ మంత్రం.. దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు

2 Nov, 2022 17:49 IST|Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు బుధవారం నాడు సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. ఇటీవల దేవి శ్రీప్రసాద్‌.. ఓ పరి అనే  నాన్‌-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్‌ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది.

పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలంది. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి!

చదవండి: నా కూతురి పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు ఆహ్వానం

మరిన్ని వార్తలు