వామ్మో కరీనా పుస్తకం.. అమెజాన్‌లో ఓ రేంజ్‌ అమ్మకాలు

10 Jul, 2021 21:21 IST|Sakshi

ముంబై: ఒక‌ప్పుడు తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో అగ్రతారగా కొనసాగిన అందాల భామ క‌రీనా క‌పూర్ తాజాగా మ‌రోసారి సినీ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. అయితే, అప్పుడు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటే .. తాజాగా ఓ రచయిత్రిగా ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీపై కరీనా రాసిన పుస్త‌కం అభిమానుల‌తోపాటు అంద‌రి మ‌న‌సులను దోచేసింది. ఇందుకు విపరీతంగా ఈ పుస్తకం అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. 

కరీనా ప్రెగ్నెన్సీ సమయంలో తన అనుభవాలను పంచడం ద్వారా తల్లులందరికీ సహాయపడుతుందనే ఉద్దేశ్యంతో ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకం రాసింది. ఈ పుస్త‌కాన్ని శుక్ర‌వారం క‌వ‌ర్ పేజీని లాంచ్ చేయ‌గా.. అది మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. దీని కోసం అమెజాన్‌లో ఆర్డ‌ర్లు వెల్లువలా వస్తున్నాయి. దాంతో సేల్ ప్రారంభ‌మైన కొన్ని గంట‌ల్లోనే భారీగా ఆర్డ‌ర్లు సాధించిన పుస్త‌కంగా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ నిలిచింది. ఈ పుస్తకంలో ప్రత్యేకతల విషయానికొస్తే.. భారత స్త్రీ గైనాకాలజిస్ట్‌ నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అయిన ఎఫ్‌ఓజీఎస్‌ఐ చే ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ ధృవీకరించబడింది. మరోకటి.. ఇందులో పలు నిపుణుల సలహాలను కూడా కరీనా చేర్చింది.

ఈ పుస్తకం ద్వారా కరీనా తనలోని రచయిత్రిని నిద్ర లేపిందనే చెప్పాలి. మార్కెట్‌లోకి విడుదలైన  ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ హాట్‌ కేకులా అమ్ముడై పాపులర్‌ రైటర్స్‌కు సైతం షాక్‌ ఇచ్చింది. పుస్తక లాంచ్‌ సందర్భంగా ఆమె ఇది తన మూడో బిడ్డ లాంటిదని వ్యాఖ్యానించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కరీనా కపూర్ ఖాన్ అమీర్ ఖాన్ సరసన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ లో కనిపించనున్నారు. ఆమె కరణ్ జోహార్ పిరియాడిక్‌ డ్రామా ‘తఖ్త్’లో నటిస్తోంది. 

మరిన్ని వార్తలు