కరీనా ఇన్‌స్టా పోస్ట్‌: అమ్మ చేతి మాలిష్‌

31 Oct, 2020 11:14 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఆరునెలల గర్భవతిగా ఉన్న కరీనా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆమె తల్లి చేతి మాలీష్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కరీనా శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో కరీనా సోఫాలో వాలిపోయి కుర్చుని ఉండా ఆమె తల్లి, మాజీ నటి బాబితా కపూర్‌ వెనకాల నిలుచుని తలకు మాలీష్‌ చేస్తున్నారు. ఈ ఫొటోకు ‘అమ్మ చేతి మాలిష్‌’ అనే క్యాప్షన్‌తో పాటు రెండు హార్ట్‌ ఎమోజీలు జత చేసి పోస్టు చేశారు కరీనా. (చదవండి: ప్యాలెస్‌ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!)

Maa ke haath ka... maalish 💯💯❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

అయితే కరీనా-సైఫ్‌ ఆలి ఖాన్‌ స్టార్‌ జంట ఆగష్టులో ‘మా కుటుంబంలోకి ఆదనంగా మరో వ్యక్తి రాబోతున్నారని. వారి రాకకు మేము చాలా సంతోషిస్తున్నాం’ అంటు కరీనా రెండవ సారి తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ఆనంతరం షూటింగ్స్‌ ప్రారంభం కావడంతో కరీనా నటిస్తున​ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందుకోసం కరీనా-సైఫ్‌లు ఢిల్లీలోని వారి పటౌడీలోని ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇటీవల ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ సెట్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి దిగిన ఫొటోను కరీనా షేర్‌ చేశారు. (చదవండి: ఇవేవి నా అభిరుచిని ఆపలేదు: కరీనా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు