Kareena Kapoor: పార్టీలతో హల్‌చల్‌.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్‌

13 Dec, 2021 16:36 IST|Sakshi

Kareena Kapoor And Amrita Arora Tested Covid Positive: హీరోయిన్‌ కరీనా కపూర్‌, నటి అమృతా అరోరా కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా కరీనా, అమృత వరుసగా ముంబైలోని పాలు పార్టీలకు హాజరవుతున్నారు. అయితే కోవిడ్‌ నిబంధనలు మాత్రం పాటించలేదని తెలుస్తుంది. ఇటీవలె ముంబైలో అనిల్‌ కపూర్‌ కుమార్తె రియా కపూర్‌ నిర్వహించిన ఓ పార్టీకి సైతం వీరు హాజరయ్యారు.

వీరితో పాటు కరిష్మా కపూర్‌, మలైకా అరోరా, మసాబా సహా పలువురు ఈ పార్టీకి అటెండ్‌ అయినట్లు సమాచారం. కాగా మలైకా అరోరాకు స్వయానా చెల్లెలే అమృతా అరోరా. కరీనాకు బీటౌన్‌లో మలైకా, అమృత బెస్ట్‌ఫ్రెండ్స్‌ అన్న విషయం తెలిసిందే.

ఇక కరీనా, అమృతా అరోరాలకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గత కొన్ని రోజులుగా వీళ్లను కలిసిన వాళ్లంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సూచించింది. 

మరిన్ని వార్తలు