బైబై లాల్‌సింగ్‌

16 Oct, 2020 01:09 IST|Sakshi

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కరీనా కపూర్‌ కథానాయిక. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. అయితే లాక్‌డౌన్‌లోనే కరీనా కపూర్‌ మళ్లీ తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కరీనా పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ ముందే పూర్తిచేయాలని చిత్రబృందం భావించింది. అలానే సెట్స్‌లో ఆమె సీన్స్‌ అన్నీ పూర్తి చేశారు. గురువారంతో కరీనా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కంప్లీట్‌ చేసి, చిత్రబృందానికి బై బై చెప్పారు. ఇతర తారలతో మిగిలిన షెడ్యూల్స్‌ను టర్కీలో చిత్రీకరించడాని సిద్ధం అవుతోంది చిత్రబృందం. వచ్చే ఏడాది డిసెంబర్‌కి ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా