ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు

11 Sep, 2021 11:57 IST|Sakshi

బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌ ఖాన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ఎక్కువగా కాంట్రవర్సీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే.  వివాహం నుంచి సంతానం వరకూ వ్యక్తిగత జీవితంలో ‘సైఫీనా’గా గుర్తింపు పొందిన ఈ దంపతులు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ కపుల్‌కి పుట్టిన రెండో సంతానానికి సంబంధించి కూడా నెట్టిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేశారు. దీంతో పిల్లలకు పేర్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుందని కరీనా సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది కరీనా.

ఈ జంటకు 2016లో ఓ కుమారుడు జన్మించగా,  ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు పుట్టాడు. అయితే మొదటి సంతానాకి ‘తైమూర్‌ అలీఖాన్‌’ అని పెట్టగా వివాదాలకు కారణమయినా విషయం తెలిసిందే. అది 1398లో భారతదేశంపై దండెత్తిన పర్షియన్‌ చక్రవర్తి తైమూర్‌ని గుర్తు చేస్తోందని నెటిజన్లు అప్పట్లో విమర్శలు చేశారు. కాగా రెండో కుమారుడికి ‘జహంగీర్‌ అలీఖాన్‌’ అని పెట్టారు. అదీసైతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేశారు. దీంతో కాంట్రవర్సీ ఎందుకని ‘సైఫీనా’ జంట బాబు పేరు ‘జెహ్‌’గా మార్చారు.

దీనిపై స్పందిస్తూ కరీనా ఇన్‌స్టాలో రెండో కుమారుడితో ఉన్న ఫోటోని తాజాగా పోస్ట్‌ చేసింది. ‘పిల్లలను కనిపెంచే తల్లిదండ్రులకి మాత్రమే వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మరెవరీకి ఉండదు. ఇతర కుటుంబ సభ్యులకి కూడా లేదు. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని’ అందులో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వూలో ట్రోల్‌పై స్పందించిన కరీనా మాకు నచ్చిన పేర్లను, బావుంటాయని పిల్లలకి పెట్టామని వెల్లడించింది. అంతేకానీ మరేంకాదని తెలిపింది. పిల్లలని భయంకరంగా ఇలా ఎలా ట్రోల్‌ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సైఫ్‌ అలీఖాన్‌ సోదరి సభా పటౌడి కరీనా​కు మద్దతుగా నిలిచింది.

A post shared by Saba (@sabapataudi)

మరిన్ని వార్తలు