Kareena Kapoor: నాటు నాటు సాంగ్‌ పెడితేనే జెహ్‌ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే: కరీనా

17 Mar, 2023 20:42 IST|Sakshi

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విశ్వ వేదికలపై పలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌నే గెలుచుకుంది. నాటు నాటుకు ఆస్కార్‌ రావడంతో యావత్‌ ప్రపంచం ఈ పాటకు ఫిదా అయ్యింది. ఎక్కడ చూసినా నాటు నాటు కాలు కదుపుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ పాట క్రేజ్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రెటీల వరకు నాటు నాటుకు స్టెప్పులు వేస్తున్నారు.

చదవండి: ‘అసహనంతో పుష్ప 2 సెట్‌ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్‌

అంతగా క్రేజ్‌ సంపాదించుకున్న నాటు నాటు పాట గురించి తాజాగా బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె హోస్ట్‌ చేస్తున్న ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’ నాలుగ సీజన్‌లో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతోంది. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో కరీనా మాట్లాడుతూ ఆస్కార్‌ విన్నింగ్‌ నాటు నాటు పాట గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని, ఇది రెండేళ్ల పిల్లాడి మనసుని సైతం కొల్లగొట్టిందన్నారు.

చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం?

తన చిన్న కుమారుడు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినడం లేదని, అది కూడా తెలుగులో వినడానికే ఇష్టపడుతున్నాడని చెప్పింది. ‘జెహ్‌కి నాటు నాటు పాట బాగా నచ్చింది. ఆ పాట వచ్చినప్పుడల్లా జెహ్‌ ఆనందంతో గత్తులు వేస్తున్నాడు. ఆ పాట పెడితే కానీ అన్నం తినడం లేదు. ఆస్కార్‌ గెలిచిన ఈ పాట.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఎంతటి మ్యాజిక్‌ క్రియేట్‌ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ కరీనా చెప్పుకొచ్చింది. కాగా కరీనా-సైఫ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు పేరు తైమూర్‌ కాగా చిన్న కుమారుడు పేరు జెహ్‌. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు