మేకప్‌ లేని ఫోటో షేర్‌ చేసిన హీరోయిన్‌!

3 Oct, 2020 18:09 IST|Sakshi

సినిమా హీరోయిన్స్ అంటే ఎప్పుడూ మేకప్‌ వేసుకొని  అందమైన ఫోటోలు షేర్‌ చేస్తూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు. వారిని మేకప్‌ లేకుండా చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి కానీ వారిని మేకప్‌ లేకుండా చూసే అవకాశం రాదు. తాజాగా బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌ ఖాన్‌ మేకప్‌ లేకుండా ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఐదు నెలలు మరింత బలవంతులం కాబోతున్నాం అని ఆమె క్యాప్షన్‌ జోడించారు. ఈ ఫోటోలో కరీనా ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంది. ఆమె జుట్టు టైట్‌గా కట్టుకొని ఉంది. ఇక త్వరలోనే కరీనా కపూర్‌ మరో బిడ్డకు జన్మనియ్య బోతున్న సంగతి తెలిసిందే. 

చదవండి: బర్త్‌డే: స్వయంగా లేఖ రాసుకున్న కరీనా

మరిన్ని వార్తలు