Kareena Kapoor: భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌.. రిప్లై ఇచ్చిన కరీనా

10 Sep, 2021 11:48 IST|Sakshi

బాలీవుడ్‌లో కరీనా కపూర్‌ ఖాన్‌కి ఉన్న క్రేజ్‌ తెలిసిందే. సైఫ్‌ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు. కాగా రామాయణం ఆధారంగా సీత పాత్ర కోణంలో ‘సీత: ది ఇంకార్నేషన్‌’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో టైటిల్‌ రోల్‌ పోషించడానికి కరీనా ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్‌ చేసిందని సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గుర్తెంది. 

కరీనా గతంలో ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ‘మైథాలజికల్‌ మూవీలో సీత పాత్ర పోషించడానికి రూ.12 కోట్లు డిమాండ్‌ చేశారంటా కదా?’ అని యాంకర్‌ అడిగింది. అందుకు బదులుగా కరీనా ఏం ఆలోచించకుండా ‘అవును’ అంది. దీంతో మైథాలజికల్‌ పాత్ర చేయడానికి అంత ఎక్కువ డిమాండ్‌ చేస్తారా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

ఈ విషయంపై తాజాగా కరీనా ఓ ఇంటర్వూలో స్పందిస్తూ.. ఈ డిమాండ్‌ పారితోషికం విషయంలో కాదని, మహిళల గౌరవానికి సంబంధించిందని తెలుపుతూ.. ‘ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించే హీరోహీరోయిన్ల పారితోషికాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయంలో గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అని చెప్పింది.

ఈ విషయంలో తాప్సీ పన్ను, ప్రియమణి వంటి నటీమణులు కరీనాకి మద్దతుగా నిలిచారు. ఎవరైనా నటుడు ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తే ఇలా అనేవారు కాదని వారు ప్రశ్నించారు. కాగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఆదిపురుష్‌’లో కరీనా భర్త సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్రలో నటిస్తుండడం విశేషం.

మరిన్ని వార్తలు