కరీనా కపూర్‌ ధరించిన మాస్క్‌ ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

6 Apr, 2021 20:32 IST|Sakshi

ముంబై :బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఇటీవలె రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. డెలీవరీ అయిన నెలరోజుల్లోనే తిరిగి వర్క్‌మూడ్‌లోకి వచ్చేసేంది కరీనా కపూర్‌. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అసత్య ప్రచారాలు నమ్మకండి..మాస్క్‌ ధరించండి అంటూ కరీనా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్‌ చేశారు. ఇందులో కరీనా ధరించన ఈ మాస్క్‌ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. సాధారణంగానే సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని కాస్ట్‌లీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. 

ఇటీవలె ఆ జాబితాలోకి మాస్క్‌ కూడా వచ్చి చేరింది. ఇప్పుడుమాస్క్‌ లేనిదే అడుగు బయటపెట్టే పరిస్థితి లేనందున సెలబ్రిటీలు వాటిని  మరింత స్టైలిష్‌గా డిజైన్‌ చేయించుకుంటున్నారు. తాజాగా కరీనా కపూర్‌ ధరించిన మాస్క్‌ ధర తెలిస్తే షాక్‌ అవ్వకుండా ఉండలేరు. ఆమె ధరించిన మాస్క్‌ లూయిస్‌ విట్టన్‌ బ్రాండ్‌కు చెందింది. నలుపు రంగులో ఉన్న ఈ మాస్క్‌పై  'ఎల్వి' సింబల్‌తో వైట్‌ కలర్‌ ఎంబ్రాడయిరీ చేసి ఉంది.

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

దీంతో ఈ మాస్క్‌ ధర తెలుసుకుందామని సెర్చ్‌ చేసిన నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే దీని ధర అక్షరాలా $355 (26వేలకు పైమాటే).  ఇక గతంలోనూ ఇదే బ్రాండ్‌ మాస్క్‌ను దీపికా పదుకొణె, రణబీర్‌ కపూర్‌, సహా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ధరించారు. దీంతో ఈ మాస్క్‌ గురించి సోషల్‌మీడియాలో చర్చ నడుస్తుంది. మీరు కూడా ఇలాంటి మాస్క్‌ కొనాలనుకుంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్రాండ్‌ మాస్క్‌ అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ ఉన్నాయి. 

చదవండి : ఎన్టీఆర్ ధరించిన మాస్క్‌ ధరెంతో తెలుసా?
కరీనా రెండో కొడుకు ఫోటో షేర్‌ చేసిన రణ్‌ధీర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు