జ్ఞాపకాలనే గుర్తించుకోవాలన్న కరీనా..

28 Aug, 2020 19:48 IST|Sakshi

ముంబై: జబ్‌ వీ మెట్‌ ఫేమ్‌ కరీనా కపూర్‌ సోషల్‌ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే తాను గతంలో ఓ రెస్టారెంట్‌లో ఆస్వాదిస్తున్న క్షణాలను నెటిజన్లకు ఫోస్ట్‌ చేసింది. కాగా కరీనా రెస్టారెంట్‌లో చదువుతున్న దృశ్యాన్ని పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలపై కరీనా స్పందిస్తు.. మీకు ఏదైనా రెస్టారెంట్‌ అద్భుతంగా అనిపిస్తే, కేవలం వాటి జ్ఞాపకాలను మాత్రమే గుర్తించుకోవాలని, కేలరీలను కాదని నెటిజన్లకు సూచించింది.

కరీనా అభిప్రాయంపై నెటిజన్లు ఫిదా అయ్యారు. కరీనా విభిన్న అభిరుచిని, ప్యాషన్‌, స్టైల్‌ను నెటిజన్లు కొనియాడారు. మరోవైపు ఓ అభిమాని కరీనాను రాణిగా కీర్తించడం విశేషం. ప్రస్తుతం కరీనా అమీర్‌ఖాన్‌తో లాల్‌సింగ్‌ చద్దా, వీరే ది వెడ్డింగ్‌ సీక్వెల్, తక్త్‌ అనే సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తుంది.  కరీనా వివిధ పోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవల కరీనా తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోను నెటిజన్లకు పోస్ట్‌ చేసింది.
చదవండి: చాలా ఏళ్ల తర్వాత జంటగా సైఫ్‌-కరీనా..!


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు