సర్దార్‌ షురూ..

26 Apr, 2021 00:21 IST|Sakshi

కార్తీ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘సర్దార్‌’ టైటిల్‌ ఖరారైంది. ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించారు. ‘‘పీఎస్‌ మిత్రన్‌ తన సినిమాల్లో చెప్పే విషయాలు, చెప్పే విధానం నాకు ఆసక్తికరంగా ఉంటుంది. మిత్రన్‌తో కలిసి ‘సర్దార్‌’ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తీ. ఈ చిత్రంలో హిందీ నటుడు చంకీ పాండే ఓ కీలక పాత్ర చేయనున్నారు. 

మరిన్ని వార్తలు