రౌడీలయితే భయపడాలా : రష్మిక

24 Mar, 2021 20:14 IST|Sakshi

కార్తి, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.  పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

ఈ సినిమాలో రష్మిక లంగావోణిలో అచ్చం పల్లెటూరీ అమ్మాయిగా కనిపిస్తుంది. రౌడీలయితే భయపడాలా ? అంటూ రష్మిక, ‘వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది’ అంటూ కార్తి  చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుంటుంది. 100 మంది రౌడీలు ఉన్న ఓ స్థానంలోకి కార్తి వెళ్తాడు. అక్కడ వాళ్లతో కలిసిపోయి.. వాళ్లను ఎలా కాపాడాడు.. ఎలా మార్చాడు అనేది సుల్తాన్‌ కథ. ఈ చిత్రానికి వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ నటుడు నెపోలియన్, లాల్, యోగిబాబు, కేజీఎఫ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


చదవండి:
మహేశ్‌ న్యూ పిక్‌‌: ఎంత ముద్దొస్తున్నాడో..
షాకింగ్‌ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు