మళ్లీ జంటగా...

22 Oct, 2020 03:51 IST|Sakshi

కార్తీ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు చిత్రం ‘ఖైదీ’. రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. హీరోయిన్‌ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఖైదీ’ చిత్రం హిందీలో రీమేక్‌ కాబోతోంది. కార్తీ చేసిన పాత్రను అజయ్‌ దేవగన్‌ చేయనున్నారు. అయితే ఈ రీమేక్‌లో ఓ పెద్ద మార్పు చేయబోతున్నారని తెలిసింది. హిందీ రీమేక్‌లో హీరోయిన్‌ పాత్రను కూడా చేర్చనున్నారట. ఈ పాత్ర కోసం కాజోల్‌ను సంప్రదించారని సమాచారం. గతంలో ‘హల్‌చల్, దిల్‌ క్యా కరే, యు మీ ఔర్‌ తుమ్‌’ వంటి సినిమాల్లో జంటగా నటించారు ఈ ఇద్దరూ. ‘ఖైదీ’లో నటిస్తే ఈ రియల్‌ లైఫ్‌ కపుల్‌ని మరోసారి  జంటగా తెర మీద చూడొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు