అప్పుడే సర్దార్‌ సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌, స్పెషల్‌ వీడియో రిలీజ్‌

27 Oct, 2022 00:37 IST|Sakshi

కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్‌’. రాశీ ఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్‌ అలియాస్‌ ‘సర్దార్‌’, ఆయన తనయుడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ప్రకాశ్‌ పాత్రల్లో మెప్పించారు కార్తీ.

ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. పోలీసాఫీసర్‌గా రాజీనామా చేసి, ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా చేరాలన్న ఆఫర్‌కు విజయ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, విజయ్‌ కొత్త మిషన్‌ కంబోడియాలో ఆరంభం కానున్నట్లుగా టీజర్‌లో చూపించడం జరిగింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్‌ మిత్రన్, నిర్మాత లక్ష్మణ్‌ కాంబినేషన్‌లోనే ఈ సీక్వెల్‌ తెరకెక్కనుంది.  

మరిన్ని వార్తలు