సుల్తాన్ టీజర్‌‌: యుద్ధం లేకుండా మహాభారతం?!

1 Feb, 2021 18:55 IST|Sakshi

కార్తీ, రష్మికా మందన్నా జంటగా నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్‌’. సోమవారం సాయంత్రం ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. పనిలో పనిగా రిలీజ్‌ డేట్‌ను కూడా వెల్లడించింది. 'మహాభారతం చదివావా?' అన్న డైలాగ్‌తో సుల్తాన్‌ టీజర్‌ మొదలవుతుంది. "మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు, అదే కౌరవుల వైపు ఉండుంటే? అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి" అని చరిత్రను తిరగరాసి చెప్తున్నాడు హీరో కార్తీ. కౌరవుల పక్షాన కృష్ణుడు నిల్చోవడం అన్న కాన్సెప్టే కొత్తగా ఉందిక్కడ. ఇక ఈ టీజర్‌లో కార్తీ పశువులను మేపుతూ, ట్రాక్టర్‌ నడుపుతూ, యాక్షన్‌ సీన్లలో ఫైటింగ్‌ చేస్తూ కనిపించాడు. (చదవండి: వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు)

అలాగే రక్తమోడుతున్న ఒకరి చేయి పట్టుకుని ఏదో మాటిస్తున్నట్లు కనిపించింది. హీరోయిన్‌ రష్మిక పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. యాక్షన్‌, లవ్‌, సెంటిమెంట్‌, డ్రామా ఇలా అన్ని అంశాలను రంగరించినట్లుగా ఉన్న ఈ టీజర్‌ అభిమానులను ఆకర్షిస్తోంది. షూటింగ్‌ పూర్తైన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి భాగ్య రాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించాడు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్‌ఆర్‌ ప్రభు, యస్‌ఆర్‌ ప్రకాష్‌ నిర్మించారు. తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. కార్తీ అంతకు ముందు నటించిన ఖైదీ, దొంగ చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. (చదవండి: కోలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అవుతున్న ర‌ష్మిక‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు