హృతిక్ రోషన్ చెల్లితో డేటింగ్.. ఆ బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..!

8 Nov, 2022 19:33 IST|Sakshi

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం నిలువలేదు. తాజాగా కార్తిక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్ సిస్టర్ పష్మినా రోషన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

యంగ్ హీరో కార్తిక్‍ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల భూల్ భూలయ్యా- 2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. తాజాగా ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు యంగ్ హీరో కార్తిక్. 

హృతిక్ బాబాయి, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రాజేశ్ రోషన్ కూతురైన పష్మినాతో కలిసి కార్తిక్ ఇటీవలే ముంబయి రోడ్లపై కనిపించి సందడి చేశారు. అంతే కాదు దీపావళి వేడుకల్లోనూ ఈ జంట ప్రత్యేక వాహనంలో ముంబైలోని జూహూలో డ్రైవ్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు రావడం, రాత్రిళ్లు పార్టీల్లో పాల్గొనడంతో డేటింగ్ రూమర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతవరకు వీటిపై ఈ జంట నోరు స్పందించకపోవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరీ పష్మినాతో బంధమైనా ఎక్కువ కాలం కొనసాగిస్తాడో లేదా వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు