‘నువ్వు చెప్పినట్లే చేద్దాం’ మోనితకు భారతి అభయం

6 May, 2021 12:01 IST|Sakshi

కార్తీక దీపం మే 6: డాక్టర్‌ బాబు తనను గెస్ట్‌లా చూస్తూ.. గెస్ట్‌ రూంలో ఉంచుతూ పరాయి వ్యక్తిలా చూస్తూన్నాడంటూ దీప బాధపడుతుంటే సౌందర్య ఒదార్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికి దీప సౌందర్య మాటలు వినిపించుకోకుండా మీరు మీ అబ్బాయి తరపునా మాట్లాడుతున్నారా అని సౌందర్యను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ‘నాకు నేనుగా ఇంట్లోనుంచి వెళ్లెపోవాలనే డాక్ట బాబు ఇలా చేస్తున్నారు. నేను చచ్చినా వెళ్లను, ఇది నా ఇళ్లు చస్తే ఇక్కడే చస్తాను’ అంటూ బాధతో వెళ్లిపోతుంది. 

ఇక మోనిత డాక్టర్‌ భారతిని తన ఇంటికి డిన్నర్‌కు పిలుస్తుంది. విషయమేంటో చెప్పు ఎదో ఇంపార్టెంట్‌ విషయం అన్నావ్‌ ఏంటదని భారతి మోనితతో అంటుంది. దీంతో మోనితా ‘నేను కార్తీక్ పడే బాధచూడలేకపోతున్నాను భారతీ.. దీప పరిస్థితి అస్సలు బాగోలేదా’ అని అడుగుతుంది. బాగోలేదు.. నేను అంతా కార్తీక్‌కి వివరంగా చెప్పాను మోనితా.. అది ఆ భార్యభర్తలకు సంబంధించిన విషయం.. నేను నీతో డిస్కర్స్ చెయ్యడం అంత మంచిది కాదేమో’ భారతి అడనడంతో.. కార్తీక్ ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నాడని, చాలా బాధపడుతున్నాడని కార్తీక్‌ వచ్చిన విషయం దీప గురించి బాధపడుతున్న విషయం చెబుతుంది. నువ్వే  చూశావ్ కదా తను ఎంత మొండిదో.. అందుకే అసలు విషయం దీపకే చెబితే అయిపోతుందని మోనిత భారతితో కూడా చెబుతుంది.

అదేంటి.. మనం పేషెంట్‌కి డైరెక్ట్‌గా చెప్పేస్తామా’ అంటుంది భారతి కాస్త కఠినంగా. చెప్పేస్తే ప్రాణం మీద తీపితో మందులు వాడుతుందని, వాడకపోతే పీఢపోతుంది తనలో ఉన్న ఆలోచనను బయటపెడుతుంది మోనిత.  అది విన్న భారతి అవేం మాటలు.. దీప ఇద్దరు పిల్లల తల్లి.. వాళ్ల కోసమైనా ఆమె బతకాలి అంటుంది. దీంతో మనసులోనే మోనితా హా మరి నేనేం అయిపోవాలి సన్యాసం పుచ్చుకోవాలా అనుకుంటుంది. మోనిత. వెంటనే.. ‘నేను చెప్పేదే నిజం అనిపిస్తోంది.. కార్తీక్ బాగా నలిగిపోతున్నాడు. ఏదో ఇంటర్ పాస్ అయిన దాన్ని చేసుకున్నాడు. ఆవిడకి మంట దగ్గర మగ్గిపోవడం ఓ వ్యసనం.. ఈ దేశోద్దారకుడెమె పాపం నగిలిపోతున్నాడని అంటోంది. ఇక భారతి నవ్వుతూ ‘ప్రకృతి చెబితే నమ్మలేదు.. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది’ అంటుంది. 

వెంటనే మోనిత ‘ఏంటి.. నేను కార్తీక్‌ని ప్రేమిస్తున్నానని చెప్పిందా అని అడగ్గానే ‘పెళ్లి అయిన మగాడ్ని ప్రేమించడం తప్పు కదా’ అంటుంది భారతి. ‘పెళ్లికి ముందే ప్రేమించాను. ప్రేమించాకే పెళ్లి అయ్యింది. అది నా తప్పు కాదు కదా.. నా సంగతి వదిలెయ్.. దీప సంగతి నాతో క్లియర్‌గా చెప్పు.. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు.. దీప పోతే నాకు ఆ ప్లేస్ దొరుకుతుందనే ఆశతో అడగడం లేదు.. కార్తీక్ అంత బాధపడుతున్నాడంటే దీప బతకడానికి అవకాశం ఉందా’ అని అనుమానంగా అడుగుతుంది మోనిత. ‘పరిస్థితి మాత్రం చాలా సీరియస్‌గా ఉంది ఇక అంతా కార్తీక్ చేతుల్లోనే ఉంది’ అంటుంది డాక్టర్ భారతి. ఇక దీప వంట గదిలో పని చేస్తుంటే కార్తీక్ అక్కడికి వచ్చి అంతా చుట్టు చూసి దీప వంట చేయడం చూసి కోపంగా వెళ్లిపోతాడు. అయితే దీప అది గమనించుకోదు.

పిల్లలు వచ్చి చెబితే.. ‘బాగానే వాదిస్తున్నాను’ అని తనని తాను పొగుడుకుంటుంది దీప. ఇక డిన్నర్‌ అయిపోయాక భారతి, మోనిత నవ్వుకుంటున్నట్లు చూపిస్తారు. ఇంకే భారతి ఇంటికి తిరిగి వెళ్లిపోతుండగా.. నువ్వు చెప్పినట్లే చేద్దామని మోనితతో అంటుంది. దీంతో మోనితా థాంక్యూ భారతి ఫ్రెండ్‌కి ఫ్రెండే కదా సాయపడాలి అంటుంది. ‘నో డౌట్ నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది’ అని భారతి మోనితకు అభయం ఇస్తుంది.  దీంతో మోనితా భారతికి థాంక్యూ చెబుతుంది. ‘థాంక్స్ ఎందుకు ఫ్రెండ్‌కి ఫ్రెండే కదా సాయం చెయ్యాలి, నీ ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది’ అంటుంది భారతి. ‘నీకు అర్థమైతే చాలు’ అంటూ మోనితా సబ్బరపడితుంది. ‘థాంక్యూ ఫర్ నైస్ ట్రీట్.. గుడ్ నైట్’ అని భారతి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత ఏమౌతుందో రేపటి ఎపిసోడ్‌లో చుద్దాం. 

మరిన్ని వార్తలు