karthika Deepam : మోనిత ప్లాన్‌ సక్సెస్‌, కన్నీరు పెట్టుకున్న కార్తీక్‌

30 Apr, 2021 14:26 IST|Sakshi

‘కార్తీకదీపం’.. ఈ సిరీయల్‌ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. వంటలక్క, డాక్టర్‌ బాబుల కలయిక అనే ఒక్క థీమ్‌తో సీరియల్‌ను రోజురోజుకు ఎంతో రక్తి కట్టిస్తున్నాడు డైరెక్టర్‌. ఇప్పటి వరకు 1000 ఏపీసోడ్‌లకు పైగా ఈ సీరియల్‌ టెలికాస్ట్‌ అయినప్పకీ డాక్టర్‌ బాబు, వంటలక్కలు కలిసింది లేదు. ప్రస్తుతం దీప ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో డాక్టర్‌ బాబు కాస్తా దిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీరియల్‌ మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే డాక్టర్‌ పూర్తిగా ఎప్పుడు మారతాడో, లేదంటే ఆలోపే దీప చనిపోతుందేమో అనే ఆందోళన ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో గత మూడు రోజుల ఎపీసోడ్‌ల్లా నుంచి మోనితా దీపను చంపేందేకు ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగానే కార్తీక్‌యే ఈ టాబ్లెట్‌ను దీపకు ఇచ్చేల మోనిత చేసింది. ఇక నేటి  ఏపిసోడ్‌లో మరి మోనిత ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందో లేదో ఒకసారి తెలుసుకుందాం. 

ఈ రోజు ఏపీసోడ్‌లో.. కార్తీక్‌ మోనిత ఇచ్చిన హైడోస్‌ డ్రగ్‌ టాబ్లెట్‌ను దీపను వేసుకొమ్మని కోరడంతో ఆమె వేసుకుంటుంది. ఆ తర్వాత సీతారాముల కల్యాణం జరిపించడానికి కార్తీక్‌తో కలిసి దీప పీటల మీద కుర్చుంటుంది. ఈ నేపథ్యంలో కాసేపటికి దీప కళ్లు తిరిగుతూ వింతగా ప్రవర్తించడం చూసి మోనితా తన పని ఇంత ఈజీ అయిపోతుందని తెగ సబ్బరపడిపోతుంది. ఇంతలో దీప కళ్లకు మైకం రావడంతో కార్తీక్‌పై పడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్‌బాబు కంగారు పడుతూ దీపను తట్టి లేపుతుంటాడు. ఇంతలో దీపను ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందే కార్తీక్‌ అని  డాక్టర్‌ భారతి చెబుతుంది. దీంతో కార్తీక్‌ దీపను ఆస్పత్రికి తీసుకుని బయలుదేరుతాడు. అయితే సౌందర్య కూడా వస్తానడంతో కార్తీక్‌ తల్లిని వద్దని చెప్పి తాను మాత్రమే వెళతాడు.

ఇక వారు అటు బయలుదేరగానే.. సౌందర్య మనసులోనే మధనపడుతూ.. ‘వుడా నా కోడలుకు ఏమైంది. తన వెనకా ఎదో కుట్ర జరుగుతుంది. అదెంటో కార్తీక్‌ రాగానే నిలదీస్తా’ అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అనంతరం సౌందర్య, ఆనందరావు, ఆదిత్యలు కుర్చోని అప్పటి వరకు బాగానే ఉన్న దీప కళ్లు తిరిగి పడిపోవడం ఏంటి అని ఆలోచిస్తారు. ఇంతలో ‘వదినకు మోనిత ఇచ్చిన టాబ్లెట్ వల్లే ఇలా జరిగిందనిపిస్తోంది’ అని అంటాడు ఆదిత్య. ఆ వెంటనే సౌందర్యకు.. మోనిత టాబ్లెట్ విషయంలో ఆమె చేసి హడావిడి ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది. ఇదిలా ఉండగా సాయంత్రానికి ఆస్పత్రి నుంచి దీపను ఇంటికి తీసుకుస్తాడు కార్తీక్‌. మరోవైపు.. దీప బతికిపోవడంతో మోనితలో అలజడి మొదలవుతుంది.

‘ఇక దీప చనిపోతుందని అనుకుంటే కార్తీక్ చావనిచ్చేట్టుగా లేడు, కార్తీక్‌ తలుచుకుంటే దీప బతకడం ఖాయం. అతనిలో దీప మీద జాలి కాదు.. ప్రేమ కనిపిస్తుంది.. ఎంతైనా కట్టుకున్న భర్త కదా.. దీపను బతికించడం తన బాధ్యత అనుకుంటాడు.. అదే నిజమైతే.. దీప బతికితే.. నా పరిస్థితి ఏంటి’ అంటూ పెద్దగా అరుస్తూ రచ్చ చేస్తుంది మోనిత. ఇక రేపటి ఎపిసోడ్‌లో సౌందర్య.. దీపి ఆరోగ్యానికి సంబంధించిన రహస్యంపై కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. ‘చెప్పారా ఏ సమస్య నిన్ను చిత్ర విచిత్రంగా ఉండేట్టు చేస్తుంది.. ఎందుకు నిజాన్ని దాస్తున్నావు. నా కోడలికి ఏమైంది’ అని కాలర్ పట్టుకుని నిలదీస్తుతంది తల్లి.

దీంతో కార్తీక్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతూ.. ‘ఎందుకంటే నీ కోడలు బతకదని డాక్టర్లు చెప్పారు కాబట్టి’ అసలు రహస్యాన్ని సౌందర్యతో చెబుతూ కన్నీరు పెట్టుకుంటాడు. అటూ దీప కూడా ‘నాకు ఏమౌతుందని.. ఎప్పటినుంచో ఉన్న అనారోగ్యాన్ని వీళ్లు ఎందుకు బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అసలు నాకెమైందని, నేను ఎంత మొండిదాన్నో చూపిస్తా’ అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. మరి దీప బతకదనే విషయం తెలుసుకున్న సౌందర్య ఏం చేస్తుంది.. దీపకి చెప్తుందా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు