మోనితకు పిండివంటలు చేసి తీసుకెళ్లిన భాగ్యం

30 Jun, 2021 15:28 IST|Sakshi

కార్తీకదీపం జూన్‌ 30 ఎపిసోడ్‌: ప్రియమణి కంగారుగా మోనితకు ఫోన్‌ చేస్తుంటే. అప్పటికే ఇంటికి చేరుకున్నమోనిత..వస్తున్నానని చెప్పాను కదే, మళ్లీ మళ్లీ చేస్తావేంటి అని విసుగ్గా అంటుంది. దీంతో ప్రయమణి వచ్చినావిడకి ఏం ఇవ్వమంటారని ఫోన్‌ చేశానమ్మా అంటుంది. ఎవరు వచ్చారు కార్తీక​ వాళ్ల అమ్మా.. అనగానే ఆవిడ నాకు తెలుసు కదమ్మా ఈవిడను నేను ఎప్పుడు చూడలేదు అని సమాధానం ఇస్తుంది. దీంతో ఎవరబ్బా నాకు చుట్టాలు ఎవరూ కూడా లేరు కదా ఎవరో చూద్దాం పదా అని లోపలికి వెళ్తారు ఇద్దరు. 

వెళ్లగానే లోపల భాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందాని అనుమానంగా చూస్తుంది. మోనితను చూసి భాగ్యం రారా మోనిత ఏమైన తిన్నావా? అసలే వట్టి మనిషివి కాదు ఎదోకటి తినాలి ఖాళీ కడుపుతో ఉండద్దు అని వెటకారంగా అంటుంది. మంచినీళ్లు తాగుతావని మోనితకు మర్యాదలు చేస్తుంటే ‘హాలో ఇది నా ఇల్లు’ అంటుంది మోనిత, దీంతో ఓహో నీ ఇల్లు అయితే మర్యాద చేయకూడదా? అని వెటకారంగా అంటుంది. వెంటనే ఈ ఇళ్లు ఎవరిది నీదేనా, డాక్టర్‌ బాబు కొనిచ్చాడా? అని అడుగుతుంది. తన డబ్బుతోనే కొనుక్కున్నానంటూ అసహనం చూపిస్తుంది మోనిత. అవునా... ఇప్పటి దాక డాక్టర్‌ బాబు నుంచి శాంతం లాగేశావ్‌ అనుకుంటున్నారంతా అంటూ భాగ్యం మోనితకు చురకలు అట్టిస్తుంది. 

సరేలే.. ఉత్తమనిషివి కాదని ఉత్తి పుట్టిళ్లు క్రియేట్‌ చేసి నీకు సున్నుండలు, మైసూరు పాక్‌, రవ్వలడ్డూలు తెచ్చాను అంటుంది. దీంతో ప్రియమణి ఎవరమ్మా మీ పిన్నిగారా? అని అడగ్గానే మోనిత కాదు దీప పిన్ని అని చెప్పతుంది. దీంతో ప్రియమణి ఒక్కసారిగా షాక్‌ అవుతుంది. ఆ తర్వాత మోనితతో ఎలాగు నీ డబ్బుతోనే ఇళ్లు కొనుక్కున్న అన్నావుగా నీకు పుట్టబోయే బిడ్డను కూడా నువ్వే పెంచుకోమని, కావాంటే డాక్టర్‌ బాబు చదివిస్తాడని మోనితకు సలహా ఇస్తుంది భాగ్యం. నా అల్లుడు అందులో బంగారం నువ్వే చూశావుగా శౌర్య ఎవరో తెలియకుండానే చదివించాడు, ఇక సొంత బిడ్డ అని తెలిసి చదివించకుండా ఉంటాడా? అంటుంది.

అలాగే కార్తీక్‌కు దూరంగా ఉంటూ తన మానని తనని బతకమని చెప్పడంతో మోనిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. భాగ్యం తెచ్చిన రవ్వలడ్డూలు తెప్పించి అవి తింటుంది. అందులో చక్కర తక్కువగా ఉందని భాగ్యం స్టైల్‌ చెబుతుంది మోనిత. సరేలే తను చెప్పే గుడ్‌ న్యూస్‌  వింటే చాలా స్వీట్‌ ఉంటుందంటూ కార్తీక్‌కు తనకు పెళ్లని, ఈ నెల 25వ తేదీన రిజిస్టర్‌ ఆఫీసులో అని చెప్పి రసీదు చూపిస్తుంది మోనిత. దీంతో భాగ్యం షాక్‌ అయ్యి ఏడుస్తూ దీపకు అన్యాయం జరుగుతుంది అంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

ఇదిలా ఉండగా దీప కార్తీక్‌ను భోజనానకి పిలవడానిక వెళుతుంది. కార్తీక్‌ తనకు ఆకలిగా లేదని, మీ ముగ్గురు తినేయండి అంటూ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెబుతాడు. ఎక్కడికి వెళుతున్నారని లేను అడగలేదే అని దీప వెటకారంగా అంటుంది. దీంతో కార్తీక్‌ నువ్వు ఏం అనుకున్న నేను మాత్రం మా అమ్మ దగ్గరికే వెళుతున్నానని, పిల్లలు అడిగితే అర్జెంట్‌ సర్జరీ ఉంటే వెళ్లానని చెప్పమంటాడు. దీప తను అబద్దం చెప్పలేను అనగాను నీకు ఎలా వీలైయితే అలా చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప ఇంతలా మదనపడుత్ను వ్యక్తి ఆ తప్పు ఎలా చేశాడు అంటూ దీప ఆలోచనలో పడుతుంది. 

కార్తీక్‌ సౌందర్య దగ్గరికి వెళ్లి దోషిలా నిలబడతాడు. సౌందర్య దేశోద్దారకుడు, సుపుత్రుడు ఎక్కడ ఆ బిరుదులు, ఏ ఇంటి వాకిట్లో తాకట్టు పెట్టివచ్చావు అంటూ కార్తీక్‌కు చివాట్లు పెడుతుంది. అలాగే మోనత, కార్తీక్‌ పెళ్లి అనే విషయం కూడా తీయడంతో ఎలా తెలుసని కార్తీక్‌ ఆశ్చర్యపోతూ అడుగుతాడు. మోనిత వచ్చి, వెళ్లిన విషయం చెబుతుంది. ఏం చేయాలి అని సౌందర్యను కార్తీక్‌ సలహా అడగ్గా.. ఏం చేసిన జవాబుదారిగా ఉండాలని చెబుతుంది. దీపకు, పిల్లలకు, తమకు మోనితకు జవాబుదారిగా ఉండాలని కార్తీక్‌ను హెచ్చరిస్తుంది. 

మరిన్ని వార్తలు